తిరుమలేశుని దర్శనానికి‌ సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

admin
Updated on: 20 Oct 2019 9:22 AM IST
తిరుమలేశుని దర్శనానికి‌ సాధారణంగా భక్తుల రద్దీ
X

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.... ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు..

ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతొంది.

నిన్నటి రోజు శనివారం 93,180 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.37 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 39,421 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.


admin

admin

Next Story