Ugadi 2023: ఈ 4 రాశులవారికి ఈ ఉగాది స్పెషల్‌.. ఊహించని ప్రయోజనాలు..!

Ugadi 2023: ఉగాది పండుగని తెలుగుసంవత్సరాది అని కూడా పిలుస్తారు.

Arun Chilukuri
Updated on: 22 March 2023 12:00 PM IST
This Ugadi 2023 is Special for These 4 Zodiac Signs you will be Surprised if you Know the Benefits
X

Ugadi 2023: ఈ 4 రాశులవారికి ఈ ఉగాది స్పెషల్‌.. ఊహించని ప్రయోజనాలు..!

Ugadi 2023: ఉగాది పండుగని తెలుగుసంవత్సరాది అని కూడా పిలుస్తారు. చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు ఈ పండుగని జరుపుకుంటారు. తెలుగువారికి శుక్లపక్షంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ప్రజలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండగను జరుపుకుంటున్నారు. 30 ఏళ్ల తర్వాత ఈసారి కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు. రాహువు, శుక్రుడు మేషరాశిలో, కేతువు తులారాశిలో, కుజుడు మిధునరాశిలో సంచరిస్తున్నారు. దీంతో నాలుగు రాశులవారికి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

తుల రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ఈ ఏడది అనుకూలంగా ఉంటుంది. ఏదైన అడ్డంకులు, సమస్యలతో బాధపడేవారికి మంచి పరిణామాలు ఉంటాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. విద్యారంగంలో విజయాలు, ఉద్యోగాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం

కొత్త సంవత్సరంలో ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్స్‌ లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఊహించని విధంగా కొన్ని పనులు జరిగి జీవితం కొత్తగా మారుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభ వార్తలని వింటారు. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఉగాది నుంచి అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి సంతోష సమయాన్ని గడుపుతారు. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

సింహం

ఈ ఏడాది సింహ రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తిని పొందుతారు. వివిధ రకాల ఆదాయ మార్గాలని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. ధీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. శివుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story