Astro News: ఈ సంకేతాలు ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి.. మీరెప్పుడైనా గమనించారా..!

Astro News: లక్ష్మీదేవిని సంపదల దేవత అంటారు. తల్లి ఒక వ్యక్తికి ఆశీస్సులు ప్రసాదించిందంటే అతని ఇంట్లో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు.

Shekhar G
Updated on: 18 Dec 2023 7:01 AM IST
These Signs Indicate The Arrival Of Goddess Lakshmi In The House Have You Ever Noticed
X

Astro News: ఈ సంకేతాలు ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి.. మీరెప్పుడైనా గమనించారా..!

Astro News: లక్ష్మీదేవిని సంపదల దేవత అంటారు. తల్లి ఒక వ్యక్తికి ఆశీస్సులు ప్రసాదించిందంటే అతని ఇంట్లో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు. ప్రతి వ్యక్తి సంపద కోసం రేయింబవళ్లు కష్టపడుతూనే ఉంటాడు. అలాగే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. శాస్త్రాల ప్రకారం ఇంట్లో లక్ష్మీ దేవి రాకను సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు ఈ సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బల్లిని చూడటం

కొంతమందికి ఇంట్లో బల్లులుంటే అస్సలు ఇష్టముండదు. కానీ శాస్త్రాల ప్రకారం సాయంత్రం ఇంట్లో బల్లిని చూస్తే శుభప్రదం. ఇంట్లోలక్ష్మీదేవి నివాసం ఉండబోతోందని, మీకు చాలా డబ్బు లభిస్తుందని అర్థం.

నల్ల చీమలు

ఇంట్లో నల్ల చీమలు తరచుగా కనిపిస్తాయి. కానీ సాయంత్రం ఇంట్లో నల్ల చీమల గుంపును చూడటం చాలా శుభప్రదం. మీరు అతి త్వరలో డబ్బు సంపాదించబోతున్నారని అర్థం.

గుడ్లగూబ

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. సాయంత్రం గుడ్లగూబను చూడటం చాలా మంచిది. మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారని సంకేతం.

పక్షి గూడు

ఎవరి ఇంట్లో పక్షులు గూళ్లు కట్టుకుంటాయో వారు అదృష్టవంతులని శాస్త్రాలలో చెప్పారు. ఇది మీ అభివృద్ధి, ఆర్థిక లాభాలను సూచిస్తుంది.

పువ్వు

సాయంత్రం పూలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం పూట తామర పువ్వును చూసినట్లయితే లక్ష్మీ దేవి మీ పట్ల దయగా ఉందని అర్థం. త్వరలో అదృష్టం వస్తుందని నమ్మకం.

Shekhar G

Shekhar G

Next Story