Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం.. ఈ 5 రాశుల వారిపై డబ్బుల వర్షం..!

Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం.. ఈ 5 రాశుల వారిపై డబ్బుల వర్షం..!

Jyothi
Updated on: 29 May 2023 6:00 AM IST
Surya Gochar 2023 Sun Transit in Rohini Nakshatra these 5 Zodiac People Impact Check Full Details
X

Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం.. ఈ 5 రాశుల వారిపై డబ్బుల వర్షం..!

Surya Gochar 2023 Impact on Zodiac Signs: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయానికి రాశిచక్రాన్ని మారుస్తుంటాయి. ఇటీవల మే 25న గ్రహాల రాజు సూర్యడు రోహిణి నక్షత్రంలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మార్పు అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. కానీ, కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడంతో ఏ రాశుల వారికి కలసివస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వీరి సంబంధాలు కూడా చాలా మధురంగా ఉంటాయి. కుటుంబ సభ్యులందరితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో లాభం పొందుతారు.

వృషభ రాశి వారికి సూర్య రాశి మార్పు లాభదాయకంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలాలను పొందేందుకు ఇది సరైన సమయం. ప్రజల్లో వీరిపై నమ్మకం, ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో ప్రజలు మీ పట్ల చాలా ఆకర్షితులవుతారు. సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడంతో కర్కాటక రాశి వారికి కనక వర్షం కురవనుంది. ఈ రాశి వారి కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. వీరి వ్యక్తిత్వం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా మారుతుంది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సింహరాశి వారికి కొంత విజయం దక్కుతుంది. వీళ్ల కెరీర్ చాలా బాగుంటుంది. దీనితో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది.

సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడంతో ధనుస్సు రాశి వ్యక్తుల వృత్తిని బలోపేతం చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు. గౌరవం, సంకల్పం పొందడంలో విజయం సాధిస్తారు.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సోషల్ మీడియాలో సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.)

Jyothi

Jyothi

Next Story