Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి విజయానికి మార్గం సుగమం అవుతుంది.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 20 May 2021 11:13 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 29th May
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈరోజు నూతన పనుల ఏర్పాట్లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమంది మీ నుంచి ఏదైనా ఆశించవచ్చు. ప్రతి ఒక్కరి అంచనాలకు అనుగుణంగా జీవించాలనే మీ ప్రత్యేకత మీ కీర్తిని విస్తరిస్తుంది. ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వెళ్లండి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రాజకీయ రంగంలో ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. క్రమంగా మీరు విజయం వైపు దూసుకెళ్తారు. చాలాకాలంగా ఆగిపోయిన పనులు విజయం సాధిస్తారు. నూతన పని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. బుధుడు ప్రభావం వల్ల మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభకరమైన వార్తలు వింటారు. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. శుభకార్యకలపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనం చేకూరుస్తాయి. వివాహంలో అవరోధాలు అంతమవుతాయి. ప్రజల్లో మీ ప్రభావం పెరుగుతుంది. వీలైనంత వరకు ఈ రోజు అప్రమత్తంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అదృష్టం మీకు కలిసి వస్తుంది. ప్రత్యర్థుల కుట్రలు విఫలమవుతాయి. ప్రాపంచిక ఆనందం కోసం శుభకరమైన వ్యయం వల్ల మనస్సులో ఆనందం ఉంటుంది. స్నేహితుడు లేదా బంధువుల నుంచి దీర్ఘకాలిక ఒప్పందం ముగుస్తుంది.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈ రోజు అలసట లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. మనస్సులో భిన్నమైన సంతృప్తిని పొందుతారు. ధర్మబద్ధమైన పనుల కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. ప్రత్యర్థులకు తలనొప్పిగా మారతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది.

తులా రాశి: ఈ రాశి వారికి మీ రహస్య శత్రువులు చురుకుగా ఉంటారు. మిమ్మల్ని వేధించడానికి కాచుకుని ఉన్నారు. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. సాయంత్రం సమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందవచ్చు. పాత బకాయిలను తిరిగి పొందవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మనస్సులో ఆనందంగా ఉంటుంది. నూతన ప్రణాళికలపై ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ రోజు మీరు మీ ఆలోచనలు ఇతరులకు తెలియజేయడం వల్ల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు రాశి వారికి విజయానికి మార్గం సుగమం అవుతుంది. పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో సంపద పెరుగుదల కనిపిస్తుంది. స్నేహితుల నుంచి డబ్బు సంపాదించడం, అనారోగ్యం కారణంగా శత్రువులపై విజయం సాధిస్తారు రాత్రి సమయంలో శుభకార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం మీకు కలుగుతుంది.

మకర రాశి: ఈ రోజు ఈ రాశివారికి శని స్థితి కారణంగా ఈ రోజు మకర రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల సాయంతో భూమి, ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రతి విషయాల్లో విజయవంతమవుతారు. పెద్దల ఆశీర్వాదంతో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. కొంతకాలం కొనసాగుతున్న వివాదం ఈ రోజు ముగియవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. పనిప్రదేశంలో విజయం సాధిస్తారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు పొందుతారు. రోజంతా నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ప్రత్యర్థి జట్టు మీ చేతుల్లో పరాజయం పాలవుతుంది. పెట్టుబడుల్లో ప్రయోజనాలు పొందుతారు. ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story