కోడెమొక్కులు స్వామి వేములవాడ రాజన్న

కోడెమొక్కులు స్వామి వేములవాడ రాజన్న
x
Highlights

తెలంగాణా రాష్ట్రములో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి వేములవాడ.. ఉమ్మడి జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లా కిందికి వస్తుంది.

తెలంగాణా రాష్ట్రములో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి వేములవాడ.. ఉమ్మడి జిల్లాలో ఇది కరీంనగర్ జిల్లా కిందికి వస్తుంది. ప్రస్తుతం జిల్లాల విభిజనలో సిరిసిల్లా జిల్లా కిందికి వస్తుంది.ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు , కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షణ కాశిగా పిలివబడే ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతీ సమేతుడై రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. పూర్వం దీనికి లేంబులవాడ అనే పేరు ఉండేదట! .. కాలేక్రమేనా లేంబులవాడ కాస్తా వేములవాడగా మారిందని పూర్వికులు చెబుతున్నారు. ఇక్కడ రాజరాజేశ్వరస్వామి లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తారు.

స్థలపురాణం :

అర్జునుడి మునిమనవాడు అయిన నరేంద్రుడు ఓ ఋషిని చంపడం వలన అతనికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుంది. దానిని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకొని కొలనులో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట.. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని ఇక్కడి పూర్వికులు చెబుతున్నారు.

ఆలయ ప్రత్యేకతలు :

♦ శివరాత్రి రోజున ఈ పుణ్యక్షేత్రంలో వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.

♦ ఈ ఆలయంలో రాజరాజేశ్వర స్వామికి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.

♦ కోడె మొక్కులు ఇక్కడ ప్రసిద్ది.. సంతానం లేనివారు గుడి చూట్టు కోడె మొక్కుల ప్రదక్షణలు చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం..

♦ మతాలకి భిన్నంగా ఇక్కడ 400 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారని చెబుతున్నారు.

♦ ఇక్కడ రాజన్న ఆలయంతో భీమన్న ఆలయం కూడా ఉంది. రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు భీమన్న ఆలయాన్ని కూడా దర్శించుకోవడం ఓ ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా బద్ది పోచమ్మ ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ది..

♦ ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకరోజు నిద్రచేసి వెళ్తారు. అలా చేయటం వలన తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాడ నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయం వారే ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేస్తారు.

♦ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో వేములవాడ కూడా ఒకటి. ఈ ఆలయాన్ని మరింత ప్రసిద్ది చెందేలా చేయాలనీ రాష్ట ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories