ఈనెల 14 నుంచి మూడురోజుల పాటు విజయవాడ దుర్గమ్మకు శాకంబరీ ఉత్సవాలు

ఈనెల 14 నుంచి మూడురోజుల పాటు విజయవాడ దుర్గమ్మకు శాకంబరీ ఉత్సవాలు
x
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 14, 15, 16 తేదీల్లో దుర్గమ్మకు శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో వి.కోటేశ్వరమ్మ తెలిపారు. ఆ మూడు రోజులు...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 14, 15, 16 తేదీల్లో దుర్గమ్మకు శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో వి.కోటేశ్వరమ్మ తెలిపారు. ఆ మూడు రోజులు దేవస్థానం ప్రాంగణంలోని అమ్మవారి మూలవరులకు, మహామండపం ఆరో అంతస్థులోని అమ్మవారికి శాకంబరిదేవిగా పండ్లు, కాయగూరలు, ఆకు కూరలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు కనువిందు చేయనున్నట్టు తెలిపారు. శాకాంబరి ఉత్సవాలు జరిగే మూడు రోజులు భక్తులందరికీ కూరగాయలతో తయారు చేసిన కదంబాన్ని ప్రసాదంగా అందజేస్తామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ మూడు రోజులు అమ్మవారి అంతరాలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు నిలిపివేస్తామన్నారు.

ఖడ్గమాలార్చన, వస్త్రాలంకరణ సేవ, త్రికాలార్చన.. ఈ మూడు సేవలను నిలుపుదల చేస్తామని, ప్రతిరోజూ యథావిధిగా సుప్రభాత సేవతోనే అమ్మవారి మేలుకొలుపు ఉంటుందని వివరించారు. శాకాంబరి ఉత్సవాల ముగింపు రోజైన 16వ తేదీన ఆషాడ పూర్ణిమ, కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చినందున ఆరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయాన్ని మూసివేసి.. తిరిగి 17వ తేదీన స్నపనాది కార్యక్రమాల అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories