Zodiac Signs: రాహువు వల్ల ఈ రాశుల వారికి చాలా ఇబ్బంది.. మీరు ఈ రాశులలో ఉన్నారా..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవులు రాశులు, నక్షత్రాలు, జాతక చక్రాల ఆధారంగా జీవితంలో మంచి చెడులని అనుభవిస్తారు.

Shekhar G
Updated on: 17 Aug 2023 7:01 AM IST
People Of These Signs Will Face A Lot Of Difficulties Due To Rahu This Year Lets Know About Those Signs
X

Zodiac Signs: రాహువు వల్ల ఈ రాశుల వారికి చాలా ఇబ్బంది.. మీరు ఈ రాశులలో ఉన్నారా..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవులు రాశులు, నక్షత్రాలు, జాతక చక్రాల ఆధారంగా జీవితంలో మంచి చెడులని అనుభవిస్తారు. అయితే ఈ సంవత్సరం రాహు, కేతు గ్రహాల వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులని ఎదుర్కోక తప్పదు. రాహువు, కేతు గ్రహాలు చాలా ఉగ్ర గ్రహాలు కలియుగంలో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యక్తుల జీవితాల్లో అనేక రకాల ఆటంకాలను కలిగిస్తాయి. గత సంవత్సరం 12 ఏప్రిల్ 2022 న రాహువు మేషరాశిలో సంచరించాడు. 18 నెలల పాటు తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మీనం వైపు కదులుతున్నాడు. రాహు సంచారం వివిధ రాశిచక్రాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

మేషరాశి

అక్టోబరు 30, 2023న రాహువు మేషరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. సవాళ్లు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బడ్జెట్ ప్రణాళికలు బెడిసికొడుతాయి. వివిధ సమస్యలు తలెత్తుతాయి. ఈగో గొడవలు పెరిగి వివాదాలు ఏర్పడుతాయి.

వృషభం

రాహువు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. బడ్జెట్ ప్రణాళికలు తప్పుదారి పట్టవచ్చు. ఏకకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

మకర రాశి

రాహు సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉండదు. సంవత్సరం చివరిలో వివాదాలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాత వ్యాధులు తిరిగి ఇబ్బంది పెడుతాయి. పని వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక శ్రమ అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story