April Marriage Dates: ఏప్రిల్‌లో వివాహ ముహూర్తాలు 4 మాత్రమే.. తేదీ, సమయం తెలుసుకోండి..!

April Marriage Dates: నేటితో మార్చి ముగిసి రేపటితో ఏప్రిల్‌ నెల ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలామంది వివాహ ముహూర్తాల కోసం వెయిట్‌ చేస్తున్నారు.

Jyothi
Published on: 31 March 2024 5:00 PM IST
Only 4 Wedding moments are coming in April know the date and time
X

April Marriage Dates: ఏప్రిల్‌లో వివాహ ముహూర్తాలు 4 మాత్రమే.. తేదీ, సమయం తెలుసుకోండి..!

April Marriage Dates: నేటితో మార్చి ముగిసి రేపటితో ఏప్రిల్‌ నెల ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలామంది వివాహ ముహూర్తాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. మరికొందరు సంబంధాలు కలుపుకోవడానికి మంచి రోజులు ఎప్పుడొస్తయా అని ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు ఖర్మ రోజులు ముగిస్తే శుభకార్యాలు చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నారు. జ్యోతిష్యం ప్రకారం గురు, శుక్రుడు అస్తమించినప్పుడు వివాహం లేదా ఏ శుభకార్యం చేయకూడదు. ప్రస్తుతం సూర్యుడు మీనరాశిలో కూర్చుని ఏప్రిల్ 13న విడిచి ఉచ్చరాశిలో సంచరిస్తాడు. దీంతో ఖర్మ రోజులు ముగుస్తాయి. ఏప్రిల్ 22 నుంచి శుక్రుడు అస్తమించడం వల్ల మే, జూన్‌లలో వివాహ శుభ ముహూర్తాలు ఉండవు. మళ్లీ జూలై 2 నుంచి వివాహాలకు శుభ ముహూర్తాలు మొదలవుతాయి. అలాగే జూలై 16 నుంచి నవంబర్ 12 వరకు చాతుర్మాస్ కారణంగా వివాహానికి అనుకూలమైన రోజులు ఉండవు.

ఏప్రిల్ లో వివాహ ముహూర్తాలు

18 ఏప్రిల్ 2024- ఏప్రిల్ 18 గురువారం వివాహానికి అనుకూలమైన సమయం. ఈ రోజు మాఘ నక్షత్రం ఈ తేదీన వివాహం చేసుకోవడం శుభప్రదం.

19 ఏప్రిల్ 2024- ఏప్రిల్ 19 శుక్రవారం. వివాహానికి అనుకూలమైన సమయం. ఈ రోజు ఏకాదశి, మాఘ నక్షత్రం ఈ రోజున వివాహం చేసుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు.

20 ఏప్రిల్ 2024- ఏప్రిల్‌ 20 శనివారం వివాహానికి అనుకూలమైన సమయం. ఈ రోజున నక్షత్రం ఉత్తర ఫాల్గుణి ఇది ఈ మాసంలోని ద్వాదశి తిథి. ఈ రోజు వివాహానికి అనుకూలమైన రోజు.

21 ఏప్రిల్ 2024- ఏప్రిల్‌ 21 ఆదివారం ఈ నెల చివరి ఆరోహణం అంటే ఏప్రిల్‌లో వివాహానికి అనుకూలమైన సమయం. ఈ రోజు త్రయోదశి తిథి. నక్షత్రం ఉత్తర ఫాల్గుణి. జ్యోతిష్య శాస్త్రంలో త్రయోదశి తిథి వివాహానికి శుభప్రదం. అయితే వివాహ తేదీని నిర్ణయించడానికి ఖచ్చితంగా పండితుడి సాయం తీసుకోండి.

Jyothi

Jyothi

Next Story