Water Compensation: ఆర్థిక సంక్షోభం తొలగిపోవాలంటే నీటి పరిహారం బెస్ట్‌.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది..!

Water Compensation: జీవితంలో చాలామంది నిత్యం డబ్బు సమస్యలతో బాధపడుతుంటారు. సరైన సంపాదన లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు.

Shekhar G
Updated on: 20 Aug 2023 6:00 PM IST
If You Want To Get Rid Of A Financial Crisis Make Water Compensation Money Will Stay At Home
X

Water Compensation: ఆర్థిక సంక్షోభం తొలగిపోవాలంటే నీటి పరిహారం బెస్ట్‌.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది..!

Water Compensation: జీవితంలో చాలామంది నిత్యం డబ్బు సమస్యలతో బాధపడుతుంటారు. సరైన సంపాదన లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఒక వ్యక్తి చేతిలో డబ్బు నిలవకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. జాతకంలో అశుభ గ్రహాలు, వ్యక్తికి సంబంధించిన చెడు అలవాట్లు ఈ పరిస్థితికి దారితీస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. ఇందులో నీటి పరిహారం చాలా ముఖ్యమైంది. దీనిని ఏ విధంగా ఆచరించాలో ఈ రోజు తెలుసుకుందాం.

రాత్రి తల దగ్గర గ్లాసు నీళ్ళు పెట్టుకోండి

డబ్బు కొరత నుంచి బయటపడటానికి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తలకి దగ్గరలో నీటితో నిండిన కుండను, చెంబుని పెట్టుకోండి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఆ నీటిని ఏదైనా మొక్కి పోయండి. దీంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు వ్యక్తి వద్ద డబ్బు నిలుస్తుంది. ఈ నీటి నివారణ మనిషి జీవితంలో వచ్చే అన్ని సమస్యలను దూరం చేస్తుంది.

సూర్య భగవానునికి నమస్కారం

సూర్య భగవానుడిని జగత్ పిత అని పిలుస్తారు. ఈయనిని ఆరాధించడం వల్ల ఉద్యోగంతో పాటు ఒక వ్యక్తి ప్రతి పనిలో విజయం, అభివృద్ధిని సాధిస్తాడు. ఆయనికి నిత్యం సంపూర్ణ అర్ఘ్యం సమర్పించడం వల్ల జీవితంలో విజయం లభిస్తుంది. సూర్య భగవానుడుకి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. ఇది వ్యక్తి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

గంగాజల్‌తో పరిహారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గంగా జలంతో కొన్ని చర్యలు చేయడం వల్ల డబ్బు కొరతను తొలగించవచ్చు. మీ వద్ద డబ్బు లేకుంటే ఇంటికి ఈశాన్య దిశలో గంగాజలం నింపిన రాగి కలశం ఉంచాలి. ఈ నీటి నివారణ డబ్బును తనవైపుకు ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంట్లో డబ్బు నిలిచి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు.

Shekhar G

Shekhar G

Next Story