Horoscope Today(20/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today Check the Predictions for the Day on April 20-2023
x

Horoscope Today(20/04/2023): నేటి రాశి ఫలాలు.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Highlights

Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే.

Horoscope Today in Telugu: ప్రతిరోజు ఓ కొత్త ఆరంభమే. మీరు క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఆ రోజు మీ నక్షత్రాలు, రాశులు, జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండనున్నాయి. శ్రీ మృదుల అందించే నేటి రాశి ఫలాల వివరాలు..

20/04/2023 గురువారం

సూర్యోదయం 05.59 సూర్యాస్తమయం 6.30

స్వస్తిశ్రీ శోభకృత్ నామసంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం , గురువారం

తిధి : అమావాస్య ఉదయం 9.43 వరకు తరువాత శుక్ల పాడ్యమి

నక్షత్రము : అశ్విని ఈ రోజు ఉదయం 11.11 వరకు తదుపరి భరణి నక్షత్రం

చంద్రరాశి : మేషరాశి 19/4/2023 నుంచి 22/04/2023

వర్జ్యం : సా .07.18 నుంచి 8.51 వరకు అర్థరాత్రి 12.46 నుంచి ఉదయం 2.22 వరకు

దుర్ముహూర్తం : ఉదయం 10.09 నుంచి 11.00 వరకు మరియు మధ్యాహ్నం 3 నుంచి సా. 4 గంటల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం 1.49 నుంచి 3.23 వరకు

అమృత ఘడియలు : సా. 4.12 నుంచి 5.45 వరకు

మేషరాశి : పనిచేసే చోట ఇబ్డందులు తోటివారు తక్కువగా చూడటం వంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

వృషభరాశి : కార్యజయము , పోగొట్టుకున్న వస్తువులు లభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలస్యమైనా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి.

మిధునరాశి : ఆధ్యాత్మిక జీవనంలో ముందంజ వేస్తారు. తండ్రివైపు వారితో సంబంధములను పెంచుకుంటారు. సంతానం విషయంలో చింత, థనలాభము గోచరిస్తోంది.

కర్కాటకరాశి : మానసిక క్షోభ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. వృత్తిలో నైపుణ్యం పేరుగుతుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త అవసరం

సింహరాశి : ఉద్యోగంలో ఉన్నతి, అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చర్మవ్యాధులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కన్యారాశి : గృహనిర్మాణాలు కలిసివచ్చే అవకాశం ఉన్నది. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉంటుంది. రాజకీయనాయకులకు అన్ని విధాలా అనుకూలం.

తులారాశి : మీ భార్య లేదా భర్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో విజయం. అందరితో మీ సంబంధం మెరుగుపడుతుంది. అవివాహితులకు కళ్యాణాది శుభయోగములు.

వృశ్చికరాశి: తలపెట్టిన పనులు ఆలస్యం కావడం. గృహనిర్మాణాలు వాయిదా పడటం, మానసికంగా, శారీరకంగా వ్యధ, నూతన వ్యాపారంలో పెట్టుబడులు కలిసిరాకపోవడం సూచనలు కనిపిస్తున్నాయి.

ధనురాశి : రాజకీయంగా ముందంజ అన్నింటా విజయం, వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం భూమిని కొని అభివృద్ధి చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

మకరరాశి : దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలనుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధిక రాబడి కనిపిస్తోంది. ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి అనుకూల సమయం.

కుంభరాశి : మానసిక, శారీరక వ్యధ కాలయాపన ఉన్నా ఆఖరులో పని పూర్తీ అవుతుంది. ఉద్యోగులకు కష్టపడి పనిచేయడం వల్ల ఉన్నత అవకాశాలు గోచరిస్తున్నాయి.

మీనరాశి : ధనము అధికంగా ఖర్చు అవుతుంది. అయితే ధనాదాయానికి లోటు ఉండదు. తెలివితేటలు సమయానుకూల ధోరణిలో కార్యక్రమాలు చక్కగా సాధించగలుగుతారు.

Sree Mrudula

Astrologer and Spiritual Healer

9704810277

Show Full Article
Print Article
Next Story
More Stories