సిరులను కురిపించే అష్ట లక్ష్మీ దేవాలయం

సిరులను కురిపించే అష్ట లక్ష్మీ దేవాలయం
x
Highlights

అష్టలక్ష్మీ దేవాలయం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ప్రధాన దైవంగా గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో...

అష్టలక్ష్మీ దేవాలయం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ప్రధాన దైవంగా గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. హిందూ పురాణాల ప్రకారం, ఈ దేవత ధన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువుల హృదయాల్లో స్థిరపడింది. కానీ కొన్ని దేవాలయాలు మాత్రమే లక్ష్మీ యొక్క ఎనిమిది రూపాలతో కూడుకొని అష్టలక్ష్మీ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినవి.

చరిత్ర

ఈ దేవాలయం ఏప్రిల్ 1996 లో కంచి కామకోటి పీఠం వారి అధ్వర్యంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధమైనది. ఇది దిల్‌సుఖ్ నగర్, ఎల్.బి.నగర్ ల మధ్య కొత్తపేట దగ్గరలో గల వాసవి కాలనీలో ఉంది.

నిర్మాణశైలి

ఈ దేవాలయ డిసైన్, వాస్తుశైలులను చెన్నై నుండి తీసుకొనడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో అనేక మార్పులు చేయడం జరిగింది. ఈ దేవాలయం సమష్టి కృషికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ దేవాలయ నిర్మాణంలో అనేక మంది ప్రజలు విరాళాలనందించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు ఐదు సంవత్సరాల కాలం పట్టింది. ఈ దేవాలయ ప్రస్తుత రూపంలోనికి రావడానికి నిర్మాణ ఖర్చు 10 మిలియన్ల రూపాయలు అయినది. ప్రసిద్ధ నిర్మాణ శిల్పి పద్మశ్రీ ఎస్.ఎం.గణపతి, ఎం.మతియాలగన్ స్థపతులు ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. సుమారు 134 విగ్రహాలు ఈ దేవాలయ మహాగోపురంలో నెలకొల్పబడినవి.

ఈ దేవాలయం ఇసుక, సిమెంటులతో నిర్మించినప్పటికీ దీని నిర్మాణ శైలి అది రూపొందించిన కళాకారుల విశేష ప్రతిభను కనబరుస్తుంది. ఈ దేవాలయంలో గల విగ్రహాలలో ఆదిలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ, ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ, వరలక్ష్మీ ప్రధానమైనవి. ఈ దేవతలు అలంకరణలను బంగారు, కాసులపేర్ల హారాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించినవారిలో కొందరు విగ్రహాల శిల్పకళ, అలంకరణలను గూర్చి ప్రస్తుతిస్తే మరికొంత మంది ఆ ఆలయ గోపురంలో గల వివిధ విగ్రహాలను గూర్చి ప్రస్తుతిస్తారు. ఈ దేవాలయ పరిథిలో సుమారు 15 మిలియన్ల రూపాయలతో ఒక కళ్యాణ మంటపం, అర్చకుల నివాసం కోసం అర్చక నిలయం నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. రాత్రి వేళలలో ఈ దేవాలయం విద్యుద్దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుండి వీక్షించేటప్పుడు పాలరాతి నిర్మాణంలా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories