Gold Price Today: పసిడి మరింత ప్రియం

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 9 May 2021 8:06 AM IST
Gold, Silver Price Today on May 9th, 2021 at Hyderabad, Delhi, Vijayawada, Mumbai, Chennai
X

Gold, Silver Price Today:(File Image)

Gold Price Today: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. తాజాగా ఆదివారం 10 గ్రాములపై రూ.80 నుంచి 100 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,200 వద్ద ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద ఉంది.

వెండి ధరలు...

దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర.. తాజాగా పరుగులు పెడుతోంది. తాజాగా భారీగా పెరిగింది. తాజాగా ఆదివారం కిలో వెండి ధరపై 100 వరకు తగ్గింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధర రూ.76,100 ఉంది.

దేశంలో వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, ముంబైలో 71,500 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71.500 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 గా కొనసాగుతోంది.

గమనిక: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story