దేశీయ మార్కెట్ లో దిగివచ్చిన పుత్తడి

* బడ్జెట్ నేపధ్యంలో రికార్డు స్థాయిలో రూ.1500 డౌన్.. * స్పాట్ మార్కెట్ లో 50 వేలకు దిగువన గోల్డ్.. * ఢిల్లీలో 10 గ్రా.పసిడి ధర 48 వేల 150 రూపాయలు..

Sandeep Eggoju
Updated on: 2 Feb 2021 2:46 PM IST
Gold price down in Indian markets
X

Gold 

దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింతగా దిగివచ్చింది..కేంద్ర బడ్జెట్ తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా 3 శాతం క్షీణించగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1500 రూపాయలకు పైగా తగ్గింది తాజా సెషన్ కి వచ్చేసరికి మరింతగా తగ్గి 48,390 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ధర భారీగా పెరిగి కిలో వెండి ధర 72వేల మార్క్‌ ఎగువన కొనసాగుతోంది దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 48,150 రూపాయలుగా నమోదు కాగా ముంబయ్ లో 48,460, చెన్నయ్ లో 45,950 రూపాయల వద్దకు చేరింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 49,260 రూపాయల వద్దకు చేరింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story