పెళ్ళికి ముందు మంగళస్నానాలు ఎందుకు చేయిస్తారో తెలుసుకోండి!

పెళ్ళికి ముందు మంగళస్నానాలు ఎందుకు చేయిస్తారో తెలుసుకోండి!
x
Highlights

పెద్ద వాళ్ళు ఎం చేసిన దానికి వెనుక అర్ధం, పరమార్ధం అనేది ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వారికీ అవి పెద్దగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన భాద్యత ఎంతైనా ఉంది....

పెద్ద వాళ్ళు ఎం చేసిన దానికి వెనుక అర్ధం, పరమార్ధం అనేది ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వారికీ అవి పెద్దగా తెలియనప్పటికీ తెలుసుకోవాల్సిన భాద్యత ఎంతైనా ఉంది. ఇక మన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అందులో ఒకటి మంగళస్నానం.. పెళ్ళికి ముందు వధూవరులకి మంగళ స్నానాలు చేయించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.. అయితే అసలు ఎందుకు అలా చేయిస్తారు. దాని వెనుక ఉన్న పరమార్ధం ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మంగళ స్నానానికి ముందు గులాబీ పూల రెక్కలను శుభ్రమైన నీటిలో వేసి కొన్ని గంటల సేపు ఉంచుతారు. ఇక పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు అన్న సంగతి తెలిసిందే.. హిందూ సాంప్రదాయం ప్రకారం ప‌సుపు అనేది శుభానికి గుర్తు అని మంగళంస్నానంలో భాగంగా వెన్నెతో కలిపిన పసుపు, చందనం బాగా మర్థిస్తారు ఆ తరువాత శెనగపిండితో మృదువుగా రుద్దుకున్నాక స్నానం చేయిస్తారు.

ఇలా చేయడం వలన వ‌ధూ వ‌రులు మ‌రింత ప్రకాశ‌వంతంగా కనిపిస్తారన్న ఉద్దేశంతో వారికి ప‌సుపును రాసి స్నానాలు చేయిస్తారు. అంతేకాకుండా అదే నీళ్ళలో కొంచెం పన్నీరు కూడా కలపినట్లయితే చర్మం కాంతిగానూ, మృదువుగానూ, సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట. దీనితో పెళ్లిలో వధూవరులు మరింత ప్రకాశ‌వంతంగా కనిపిస్తారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories