Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఖర్చులు అదుపు తప్పుతాయి

Daily Horoscope: ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది.

Kranthi
Published on: 27 March 2021 6:56 AM IST
Daily Horoscope Rasi Phalalu Panchangam DinaPhalallu
X

Daily హోరోస్కోప్:(ఫైల్ ఇమేజ్)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శనివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.10 | సూర్యాస్తమయం సా.6.07| తిథి శు.పంచమి రా.గం.11.24వరకు | తదుపరి షష్టి |నక్షత్రం భరణి ఉ.8.28 వరకు| తదుపరి కృతిక|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం 6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.9.48 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.57 పున: మ.2.56 నుంచి మ.3.44 వరకు| అమృతఘడియలు -| కరణం బవ ఉ.10.19| యోగం వైధృతి ఉ.గం.8.12ల వరకు|

ఈ రోజు రాశి ఫలితాలు

మేష రాశి: ఆదాయంలో మార్పేమీ ఉండదు. ఊహించని ఖర్చులు మీద పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

వృషభ రాశి: ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం పరవాలేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మిథున రాశి: ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కనిపిస్తుంది. సన్నిహితులు అపార్థాలు చేసుకుంటారు. స్నేహితురాలి విషయంలో ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

కర్కాటక రాశి: ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

సింహ రాశి: ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య రాశి: అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

తుల రాశి:ఆదాయం నిలకడగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఇరుగు పొరుగుతో పిక్నిక్‌ చేసుకుంటారు. వ్యాపారులకు, ఐ.టి నిపుణులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. పెళ్లి సంబంధం కుదురుతుంది. కామర్స్‌ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి: ఆదాయం పరవాలేదు. కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.

ధనస్సు రాశి: ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ను ఆశించవచ్చు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకర రాశి: ఆదాయంలో పెరుగుదల ఏమీ ఉండదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలు ముఖం చాటేయవచ్చు.

కుంభ రాశి: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగానికి ఆఫర్‌ అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అన్ని విధాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

మీన రాశి: ఆదాయం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

గుల్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story