Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 03 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 03 పంచాంగం, రాశిఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 03 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పూర్ణిమ (రాత్రి 8-46 వరకు) తదుపరి పాడ్యమి; ఉత్తరాషాఢ నక్షత్రం (ఉ.7-45 వరకు) తదుపరి శ్రవణం నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 9-38 నుంచి 11-16 వరకు), వర్జ్యం (ఉ. 11-49 నుంచి 1-27 వరకు) దుర్ముహూర్తం ( మ. 12-31 నుంచి 1-22 వరకు తిరిగి 3-04 నుంచి 3-55 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రక్షా బంధన్..రాఖీ పౌర్ణిమ..శ్రావణ పౌర్ణిమ

ఈరోజు రాశి ఫలాలు

మేషం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృషభం: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిథునం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిత చింతన. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశ. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కన్య: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.

తుల: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. నూతన పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకోవాల్సి ఉంటుంది.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. ధనప్రాప్తి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మీనం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories