Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 27 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ

K V D Varma
Published on: 27 July 2020 7:53 AM IST
todays horoscope 27th july
X
rashiphalalu

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 27 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం సప్తమి (ఉ.7-09 వరకు) తదుపరి అష్టమి (తే.4.58వరకు) తదుపరి నవమి, చిత్త నక్షత్రం (ఉ. 11-03 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం (సా. 4-20 నుంచి 5-51 వరకు) దుర్ముహూర్తం (మ. 12-39 నుంచి 1-31 వరకు తిరిగి మ.3.14 నుంచి సా.4.05 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు రాశి ఫలాలు

మేషం

శుభఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో ముందస్తు ప్రణాళికలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

లక్ష్య ఛేదనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చును. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వాదప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు సాగండి. అధికారుల సహకారం ఉంటుంది. సూర్య ఆరాధన శుభప్రదం.

సింహం

చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. మనోబలంతో ముందుకుసాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కన్య

ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. కీలక సందర్భాల్లో తోటి వారి సలహాలు అవసరమవుతాయి. అపార్ధాలకు తావివ్వకండి. దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.

తుల

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం

చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమిస్తారు. సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణము, అష్టలక్ష్మీస్తోత్రము పఠిస్తే మంచిది.

ధనుస్సు

మిశ్రమ ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. మంచి భవిష్యత్తుకై మీరుచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి సందర్శనం మంచిది.

మకరం

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీ మనోధైర్యం చెదరదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం అందులో మీకు తోడ్పడతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితములు లభిస్తాయి.

కుంభం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధువులతో వైరసూచన. గణనాయకాష్టకము పఠిస్తే మంచిది.

మీనం

మీ అధికార పరిధి పెరుగుతుంది. కొన్ని కీలక వ్యవహారములో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. గణపతి ఆరాధన శుభాన్నిస్తుంది .


K V D Varma

K V D Varma

Next Story