Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today7th April
X

Todays Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| బుధవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. వృత్తిలో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

వృషభం: ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నేహితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్థులకు బాగుంది.

మిథునం: ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం: ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

సింహం: ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు కానీ, పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

కన్య: అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది.

తులా: ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.

వృశ్చికం: ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలించదు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు.

ధనుస్సు: ఉద్యోగం మానే ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం: ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.

కుంభం: ఉద్యోగంలో బాగా ఒత్తిడి వున్నప్పటికీ ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మీనం: ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today7th April
Next Story