Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశముంది

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 13 May 2021 6:24 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today  13th May
X

Daily Horoscope:(File Image) 

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రోజు ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. తల్లి వైపు నుంచి డబ్బు పొందే అవకాశముంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశముంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాలొగంటారు.

వృఫభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పని ఆలస్యం కావడం వల్ల ఆందోళన చెందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో వివాదాలు తలెత్తుతాయి. లోతైనా ఆలోచనల్లో నిమగ్నమవుతారు. సహోద్యోగులు ఏకపక్ష ప్రవర్త కారణంగా మీరు ఆగ్రహానికి లోనవుతారు. మధ్యాహ్నం తర్వతా మీ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కుటుంబంలో అనవసర విషయాలను పట్టించుకోకండి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సహోద్యోగుల భాగస్వామ్యం లభిస్తుంది. మీరు సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. అనవసర ఖర్చులను నియంత్రించండి. ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణాలు ప్లాన్ చేయవచ్చు. ఆర్థిక ప్రయోజనం పొందాలంటే సోమరితనాన్ని విడనాడాలి. పనిలో చురుకుగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ అజాగ్రత్త వల్ల నష్టపోయే అవకాశముంది. ఉదయం నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పనిప్రదేశంలో ఎక్కువ శ్రద్ధ చూపడం ద్వారా లాభాలు అందుకుంటారు. పనిప్రదేశంలో ఆరోపణలు ఎదుర్కొనే అవకాశముంది. మీ మాటలపై సంయమనంగా ఉండండి. మీకిష్టంలేని పని చేయాల్సి ఉంటుంది. అనవసర విషయాలను పట్టించుకోకపోతే మంచిది.

సింహ రాశి: ఈ రోజు ఈ రాశి వారు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. మీరు ఒప్పందాన్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు మీరు విమర్శలు ఎదుర్కోవచ్చు. పనిప్రదేశంలో మీ పనులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకరమైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మనస్సులో ఆనందంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. శారీరక బాధ కలుగుతుంది.

కన్యా రాశి: ఈ రోజు ఈ రాశి వారు నూతన పథకాలను చేపట్టే ముందు లాభనష్టాలను సమీక్షించండి. మేధోపరమైన పనుల ద్వారా ఆదాయాన్ని అందుకుంటారు. కోపాన్ని నివారించండి. మధ్యాహ్నం తర్వాత మీరు ఆర్థిక విషయాల్లో విజయం పొందుతారు. ప్రయాణాలు చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు.

తులా రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ప్రభుత్వ రంగం నుంచి శుభవార్త అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశముంది. పనిప్రదేశంలో మీ కోరికకు వ్యతిరేకంగా ఏదైనా పని చేసే అవకాశముంది. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల సరైన ఫలితాలు పొందుతారు. మధ్యాహ్నం వరకు పనిలో అంతరాయల కారణంగా మీరు నిరాశ చెందుతారు. పరిచయస్తుల సహకారం వల్ల ప్రయోజనం అందుకుంటారు. అశుభ వార్తల మనస్సు చెదిరిపోతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు బిజీగా ఉండటం వల్ల మీ కోరిక అసంపూర్ణంగా ఉంటుంది. ప్రాపంచీక కార్యకలపాల్లో బిజీగా ఉండటం వల్ల మీరు మిమ్మల్ని విస్మరిస్తారు. అయితే ఆర్థిక ప్రయోజనంతో సంతృప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

మకర రాశి: ఈ రోజు మీకు కృషికి తగిన ఫలితాలు లేకపోవడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయకండి. అంతేకాకుండా నూతన పనిలో పెట్టుబడులు పెట్టకండి. పనిప్రదేశంలో అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీ ఖ్యాతిని కోల్పోవచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి.

కుంభ రాశి: ఈ రాశి వారికి పనిప్రదేశంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో బిజీగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతికి విభేదాలు ఉంటాయి. కుటుంబం అనారోగ్యం కారణంగా ఖర్చు అవుతుంది. సాయంత్రం సమయంలో దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనికోసం ఒకరి నుంచి రుణం తీసుకునే అవకాశముంది. ఆధ్యాత్మిక విశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలే పెద్ద వివాదాలుగా మారే అవకాశముంది. ప్రజా సంబంధాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీరు ఆస్తిలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం పొందుతారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story