Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 9 Jun 2021 5:54 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 9th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పనిప్రదేశంలో మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కానీ సహోద్యోగులు మీ వల్ల ఇబ్బందులు పడే అవకాశం వుంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.శుభకార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. బంధువుల్లో మీ పట్ల ఆదరణ పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు బిజీబిజీగా గడుపుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యలు మధ్దతుతో పనులు పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఈ రోజు ఆగిపోయిన పనులు పూర్తి చేయడం ద్వారా మనస్సు సంతృప్తి చెందుతుంది. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. రాష్ట్ర గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు బాగా ఆలోచించండి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు రాజకీయ రంగంలో అకాల విజయం అందుకుంటారు. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. జీర్ణక్రియ మందగించవచ్చు. కంటి సంబంధిత సమస్యలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు పుణ్య కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఫలితంగా మనస్సులో ఆనందంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషకరమైన పరిస్థితి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సరైన సలహా పొందడం ద్వారా మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఇతరులతో మాట్లాడే విధానం, నిజాయితీ మీకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకిష్టమైనవారితో సమావేశం ఉంటుంది. మనస్సులో సంతోషంగా ఉంటుంది. మీ మాటలను నియంత్రించండి. వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. ఎవ్వరితోనూ వాగ్వాదానికి దిగకండి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఇంటి వస్తువులను కొనుగోలు చేయడానికి సమయం పడుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో కొంత వివాదం ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాల్లో చిక్కుకోకపోవడం మంచిది. పనుల్లో అవరోధాలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వారికి మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ప్రణాళికలను మార్చుకుంటారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. వాహనాలను ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రమాదవశాత్తు వాహనానికి నష్టం వాటిల్లుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అనారోగ్యం సూచిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల కొనుగోలులో చట్టపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూల ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు వ్యాపారంలో పెరుగుతున్న పెరుగుతున్న పురోగతి వల్ల ఆనందం ఉంటుంది. విద్యార్థులు మానసిక మేధోభారం అధికంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. ప్రయాణ సూచనలు కనపడుతున్నాయి. ఒక ముఖ్యమైన సమచారాం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story