Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా వున్నాయంటే

Kranthi
Published on: 9 July 2021 6:21 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 9th July
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా వున్నప్పటికీ తగిన ధనం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా బాగుటుంది. ఎవ్వరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం వుంది. కుటుంబ సమస్యల పరిష్కారానికి దృష్టి పెడతారు. అనవసరంగా అప్పులు చేసే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టపోతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి తీపి కబురు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తులరాశి: ఈరాశి వారికి ఈరోజు వ్యాపారంలోనివారు మరింతగా శ్రమపడాల్సి ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మంచి ఉద్యోగం దొరుకుతుంది. బంధువులకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. భార్య తరపు బంధువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పరవాలేదు కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. వ్యాపారులకు ఆర్థికంగా చాలా బాగుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story