Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు చాలా సహనంగా వ్యవహరించాల్సి వుంటుంది.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 8 Jun 2021 6:47 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 8th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తతో పనులు చేయాలి. అలసత్వం తగదు. అడగకుండానే సహాయం చేసేవారున్నారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సకాలంలో లాభాలు ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడానికి అదనంగా డబ్బు ఖర్చు చేయాలి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్వార్థంపరులకు దూరంగా ఉండండి. సాయంత్రం సమయంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు

మిథున రాశి: ఈ రాశి వారు చాలా సహనంగా వ్యవహరించాల్సి వుంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరంగా వివాదాలకు దిగకండి. ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తెలివిగా వ్యవహరించండి. వ్యాపరంలో అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఈ రోజు ప్రలోభాలకు దూరంగా వుండాలి. వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. జాగ్రత్తగా వుండాలి. అనవసరమైన ఖర్చు మానసిక క్షోభకు దారితీస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ నిర్లక్ష్యం కారణంగా సరైన సమయంలో పనిని పూర్తి చేయలేరు. వ్యాపారం నుంచి లాభాలు పొందడానికి పూర్తి అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఏదైనా సంఘటనలకు సంబంధించి తీరిక లేకుండా సమయాన్ని గడపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు రోజంతా కష్టపడి పనిచేయలి. పెట్టుబడుల్లో అనుకూలమైన లాభాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పై అధికారులు, సహోద్యోగుల స్వభావంలో ఆకస్మికంగా మార్పులు రావడం వల్ల ఉద్యోగస్తులు కలత చెందుతారు. కుటుంబ సభ్యులతో సాయంత్రం సమయంలో సరదాగా సమయాన్ని గడుపుతారు.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఇంట్లో ఎవరికైనా ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా అశాంతి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరితోనూ వాదించకండి. ఎందుకంటే మీకు మనశ్శాంతి ఉండదు. కొన్ని తప్పులు కారణంగా మీలో అపరాధ భావన పెరుగుతుంది. ఆనందంగా ఉండేందుకు డబ్బు ఖర్చు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు మీ దృష్టి అంతా వినోదంపై ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా అశాంతి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరితోనూ వాదించకండి. ఎందుకంటే మీకు మనశ్శాంతి ఉండదు. కొన్ని తప్పులు కారణంగా మీలో అపరాధ భావన పెరుగుతుంది. ఆనందంగా ఉండేందుకు డబ్బు ఖర్చు చేస్తారు.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు అవసరమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. స్నేహితులతో ప్రయాణాలు సాగించే అవకాశముంది. విదేశీ పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఈ పనులు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ పిల్లల ఆరోగ్యం కోసం డబ్బు వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతో అనవసర వాదనలు పెట్టుకోకండి..

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వారికి వ్యాపారంలో సొంత నిర్ణయాల వల్ల నష్టపోతారు. కాబట్టి అహంకారాన్ని వదులుకోవాలి. అనుభవజ్ఞులైన వ్యక్తి సలహా తీసుకోండి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకండి. నిరుత్సాహంతో పనులు చేపడతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆర్ధికంగా కొంత అనుకూలంగా వుంటుంది. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులు మీతో కోపంగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు పురోగతి సాధిస్తారు. ఎవ్వరికీ డబ్బు సంబంధిత వాగ్ధానాలు చేయకపోతే మంచిది. వ్యాపార భాగస్వాములు, సోదరులతో ఉద్రిక్తత ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఆర్థిక విషయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల మీకిష్టమైన వ్యక్తితో వివాదం ఉండవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story