Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు కోర్టు కేసులో అనుకోకుండా విజయం సాధిస్తారు

Daily Horoscope:(File Image)
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా వున్నప్పటికీ తగిన ధనం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఏపనులు చేపట్టినా పెద్దల సలహాలతో ముందుకు వెళ్లాలి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే అవకాశం ఉంది. అనారోగ్య సూచలను కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఒత్తిడి అధికంగా వుంటుంది. ఉద్యోగస్తులకు శుభఫలితాలు ఘోచరిస్తున్నాయి.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఐటీ రంగాల వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రుల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కగలుగుతారు.
కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు కోర్టు కేసులో అనుకోకుండా విజయం సాధిస్తారు. డబ్బు కలిసి వస్తుంది. పెళ్లి ప్రయత్నం ఫలించవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. గతంలో మీరు ఆదుకున్నవారు ఇప్పుడు మీకు సహాయం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి పెడతారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కంపెనీ నుంచి శుభవార్త వింటారు. ఒక పాత ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అడపాదడపా ప్రయాణాలు తప్పకపోవచ్చు. ధన నష్టం సూచిస్తోంది. జాగ్రత్తలు పాటించండి.
తులా రాశి: ఈరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్త వింటారు. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమీప బంధువులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపతాపాలకు ఇది ఏమాత్రం సమయం కాదు. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఇంట్లో శుభకార్యం తల పెడతారు. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు.
ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారులకు బాగా శ్రమ పెరుగుతుంది. ఆదాయం పెరిగినా ఇంటి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగంలో పై అధికారులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. చిన్నప్పటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి అనుకూల సమాచారం అందుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి శుభవార్తలు వింటారు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పురోభివృద్ది కనపడుతోంది. అధికారులనుండి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తికి సంబంధించి మీ కలలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT