Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి ఉద్యోగస్తులు అనదపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 7th July
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు తలచిన పనులు నెరవేరుతాయి. వ్యాపారుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు ఆర్థిక సాయం అందిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఏ పనిలో అయినా పట్టుదల, శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అనదపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వ్యాపారులు అన్ని విధాలా లాభపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కర్కాటకరాశి: ఈరాశి ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారాలనే ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనవసర వాదనలకు దూరంగా వుండాలి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఏదైనా కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపి ఖర్చు బాగా చేస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది

తులా రాశి: ఈరాశి వారికి వృత్తి నిపుణులకు, వ్యాపారులకు సమయం బాగుంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య ఉండదు. తలచిన పనులు నెరవేరుతాయి. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. వ్యాపారులు చక్కగా పురోగతి సాధిస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచనలున్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు, అధికార యోగానికి అవకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశి వారు పరిస్థితులను బట్టి వ్యాపారం చేయాల్సి వుంటుంది. ఇతరులతో అనవసర వాదనలకు తావివ్వొద్దు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆదాయం పరవాలేదు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories