Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 6th June Predictions,  Astrology,  Horoscope
X

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో సమయానుకూలంగా వ్యవహరించి సానుకూల ఫలితాలు పొందుతారు. పనుల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. మేధో సామర్థ్యం, పురోగతితో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. పేదవారికి వస్త్రదానం చేసుకోవడం శుభప్రదం. వివాదాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.

మిథున రాశి: ఈ రాశి వారు వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాభివృద్ధిలో నూతన ప్రణాళికలు అనుసరిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ధన్వంతరిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వారికి విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి. ఆర్థిక కారణాల వల్ల ఇంట్లో ఉద్రిక్తత ఉండవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే మీ ఆలోచనలను గుర్తించండి. లేకపోతే మీరు గౌరవం కోల్పోవచ్చు. మీ ఖర్చులు పెరుగుతాయి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. భవిష్యత్తులో లాభం పొందే అవకాశముంది. మీ చుట్టుపక్కల వారి సంక్షేమం కోసం మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రాపంచీక వ్యవహారాలపై ఆసక్తి చూపుతారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో మీ సేవలకు తగిన గౌరవం లభిస్తుంది. కార్యాలయంలో పై అదికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీరు అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈ రోజు గుడ్డిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు తీర్థయాత్రలకు వెళ్లాలని ప్రణాళిక వేస్తారు. వ్యాపారంలో కొంత ఇబ్బంది తర్వాతా ఆదాయం పెరుగుతుంది. సహోద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉండండి. లేకుంటే విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగార్థులకు కొంతకాలం ఇబ్బందిగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే వారారి మార్గం మధ్యలో అవరోధాలు వచ్చే అవకాశముంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ఒప్పందం లేదా పనిలో పొరపాటు కారణంగా వ్యాపారస్తులు నిరాశ చెందుతారు. ప్రభుత్వ, ఆస్తి సంబంధిత విషయాల్లో విభేదాలు పెరగవచ్చు. బంధువులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. అపరిచితుల చేతిలో మోసపోవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి పెద్దవారి సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యాపారస్తులు ప్రభుత్వ సహాయం పొందే అవకాశముంది. ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు సజావుగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో నిజాయితీగా ఉంటారు. కొంత తమ కోసం డబ్బు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో విభేధాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య పరస్ఫర ఐక్యత ఉంటుంది.

మకర రాశి: ఈ రాశి వారికి వ్యాపార సంబంధాల కంటే డబ్బుకే అధిక ప్రాముఖ్యత ఇస్తారు. బయట ఉన్నవారు ఇంట్లో కంటే మిమ్మల్ని ఎక్కువగా విశ్వసిస్తారు. ఉపాధికి సంబంధించిన పనులు వారి సొంత బలంతోనే చేయాల్సి ఉంటుంది. రోజువారీ వినియోగానికి సంబంధించిన వస్తువులపై ఖర్చు చేస్తారు. ఇంటి సభ్యులపై ఎక్కువ ఖర్చు చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారంలో పని సహజంగా ఉండనివ్వండి. ఈ రోజు నూతన వ్యాపార ప్రయోగాలు చేయవద్దు. నష్టం ఉండవచ్చు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ధారించుకోండి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు వ్యక్తిగత పనుల్లో జోక్యం చేసుకోకుండా ఎవ్వరికీ సలహా ఇవ్వవద్దు. మీరు గౌరవం కోల్పోవచ్చు. ఇంటి సమస్యల కారణంగా రోజులో ఎక్కువ భాగం మానసికంగా బాధపడుతూనే ఉంటారు. అనైతిక మార్గాల నుంచి సంపాదించాలని భావిస్తారు. ఇది మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. చేపట్టినటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 6th June
Next Story