Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంది

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 6th July
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ధనం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వుండాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వాదనలకు దిగి కష్టాలు తెచ్చుకోద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. .

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకుండా ఉండడమే మంచింది.

కర్కాటకరాశి: ఈరాశి వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు . ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా రాశి: ఈరాశి వారికి ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నష్టపోతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. కొన్ని అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వివాహ సంబంధం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతాయి. అనవసర ఖర్చులకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీన రాశి: ఈ రాశి వారికి పెద్ద సంస్థలో ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలాకాలంగా పెండింగ్ లో వున్నపనులను అతి కష్టమీద పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories