Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 5 May 2021 6:04 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 5th May
X

Daily Horoscope:(File Image) 

నేటి రాశిఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృఫభరాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది

మిథున రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు.

సింహ రాశి: ఈ రాశి వారు గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఉన్నా ముందుకు దూసుకు వెళ్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఎదుగుదకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్ని ఇస్తాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని లాభాలు ఉంటాయి.

తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి నిపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి.


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story