Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఆకస్మిక లాభాలు అందుకుంటారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 4 Jun 2021 5:53 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 4th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు సమయానుకూలంగా వ్యవహరించాల్సి వుంటుంది. దీంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఫలితంగా మీ కీర్తి పెరుగుతుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులను శ్రద్ధతో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. మీ శక్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత అంశాలు ఈ రోజు త్వరగా పూర్తి చేసుకుంటారు. కార్యాలయంలో మీకు అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశి వారు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్వభావరీత్యా సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన లేదా ఇతర రకాల వాగ్ధానాలు చేయవద్దు. లేకుంటే ఇందుకు మీరు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు మొండితనంతో ఏదైనా విషయంపై పట్టుబట్టవచ్చు. పనిప్రదేశంలో నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనం పొందిన తర్వాత వెంటనే నిరాశ చెందాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఏకపక్షంగా ప్రవర్తిస్తే మీరు రిలాక్స్ గా ఉంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకుంటారు. ఈ రోజు ఎలాంటి అనైతిక చర్యలు చేయకుండా ఉండాలి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారవేత్తలు నూతన పనిలో పెట్టుబడులు పెట్టవచ్చు. భవిష్యత్తులో సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కార్యాలయంలో సీనియర్ అధికారులు మీ పని పట్ల అసంతృప్తికరంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటి సభ్యులు సంతోషంగా ఉంటారు. దగ్గు, జలుబు సంబంధిత సమస్యలు ఉండవచ్చు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మీ ప్రమేయం లేకుండానే పనులు ఆలస్యం అవుతాయి. ఇతర కారణాల వల్ల ఇల్లు లేదా కార్యాలయంలో నష్టం జరుగుతుందనే భయం ఉంది. ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. ఇదే సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణాన్ని తీసుకుంటే వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించండి.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దానాలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుకు సరిపడ ఆదాయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.సాయంత్రం సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆకస్మిక లాభాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. డబ్బు పెట్టుబడి విషయంలో భయపడకండి. భవిష్యత్తులో రెట్టింపు అవుతుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు మీ ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివాదాలను ఈ రోజు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ అధికారుల నుంచి పని పొందడానికి ఈ రోజు మంచి రోజు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోతే మంచిది. రాబోయే రోజుల్లో అవాంతరాలు ఉండవచ్చు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వారికి మీకు కావాల్సిన విజయం లభించదు. ఈ కారణంగా మీరు అసమంజసమైన డిమాండ్ నెరవేర్చడానికి వెనుకాడరు. అనవసర విషయాలను పట్టించుకోకండి. వ్యర్థ వ్యయాలను నియంత్రించండి. మీరు పడే కష్టాలనికి తప్పకుండా ఫలితం లభిస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యలు సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు చేయడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదించడానికి ఇదే మార్గం. సంక్లిష్టమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా ఇతరుల కంటే త్వరగా విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో డబ్బు విషయంలో ఎలాంటి రాజీ పరు. ఇదే సమయంలో అవసరమైనదానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. పాత పనులు ఆలస్యమైనప్పటికీ డబ్బు రావడం వల్ల మర్చిపోతారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story