Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వాారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 4 July 2021 5:51 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 4th July
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు నహకరిస్తారు. లాభాలు గడిస్తారు. .

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.అనుకున్న పనులు పూర్తవుతాయి. డబ్బు కూడగట్టుకుంటారు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి తిరుగులేదు. నమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్దులకు పరవాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒకవ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

తులా రాశి: ఈరాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది.

మకర రాశి: ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్జు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎలిన్నాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతు౦ది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మీన రాశి: ఈ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్ధలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. అరోగ్యానికి ఢోకా లేదు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story