Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 31 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 31 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు


మేషం: బంధువులతో కొన్ని వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: శుభవార్తలు వింటారు. ప్రముఖు ల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వి ద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పూర్వవైభవం. వస్తులాభాలు.

మిథునం: ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

కన్య: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

తుల: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని అవకాశాలు. దైవచింతన.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వాహన, గృహయోగాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం. పనులలో ప్రతిష్ఠంభన.

కుంభం: రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కళాకారులకు అవార్డులు రాగలవు.

మీనం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories