Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 30 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 30 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం: రుణదాతల ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. చేపట్టిన పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

తుల: రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. కొత్త నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మకరం: ఏ పని చేపట్టినా స్వల్ప ఆటంకాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: శ్రమాధిక్యం. నిరుద్యోగులు, వ్యవసాయదారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories