Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి ఆరోగ్యంపై నిర్లక్ష్యం పనికిరాదు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 30 May 2021 5:37 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 30th May
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఈ రోజు వ్యాపారంలో అతి కష్టం మీద పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. ఖర్చు విషయాల్లో జాగ్రత్తలు అవసరం.

వృషభరాశి: ఈ రాశి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేయాలని భావిస్తారు. పూర్వీకుల గురించి ఇంట్లో చర్చ జరుగుతుంది. సాయంత్రం సమయంలో మీరనుకున్న కోరికలు నెరవేరుతాయి..

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం, ఆర్థికపరమైన విషయంలో అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధగా ఉండకూడదు. అయితే ఏకాగ్రత లోపం వల్ల రోజువారీ ఆరాధన ఆచారణాత్మకంగా నిర్వహించలేరు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం కోసం సమయం, డబ్బు రెండు ఖర్చు చేస్తారు. భూమిపై పెట్టుబడి పెట్టడం మంచిది. .

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి ఆరోగ్యంపై నిర్లక్ష్యం పనికిరాదు. అనంతరం పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. విషయాలపై స్వీయ నియంత్రణం లేకపోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు బాధపడతారు. వ్యాపారంలో ఇబ్బంది ఉండదు. అయితే లాభ, నష్టాలను పెద్దగా పట్టించుకోరు.

సింహ రాశి: ఈ రాశి వారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివిధ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ వనరులు ఏకీకృతం చేయగలుగుతారు. వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాటి ప్రకారమే ముందుకు వెళ్తారు. సాయంత్రానికి మానసిక ప్రశాంతత పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి పనిప్రదేశంలో చాలా ఆలోచనలు మనస్సును కలవరపెడతాయి. సహోద్యోగుల కొరత కారణంగా వ్యాపార ప్రణాళికలు రద్దు చేసుకుంటారు. ఇల్లు లేదా కార్యాలయాన్ని అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు అనవసర విషయాలను పట్టించుకోకపోతే మంచిది. మీ అభిరుచులు తీర్చుకోవడానికి ఖర్చు పెడతారు..

తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారం మందగించడం వల్ల ప్రణాళికలు నిలివేస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అనవసరమైన పనులకు ఈ రోజు మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. సాయంత్రం సమయంలో ఊహించినదానికంటే ఎక్కువగా ఆనందదాయకంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు రోజువారీ ఖర్చులు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పెద్దల జోక్యంతో కుటుంబంలో వివాదం పరిష్కరించబడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. .

ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు ఈ రోజు దానాలు ఎక్కువగా చేస్తారు. ఫలితంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. వ్యాపారంలో లాభం కోసం ఎదురుచూస్తుంటే ఈ రోజు మీకు నిరాశ ఎదురవుతుంది. బంధువులతో సంబంధాలు సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు. .

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు గందరగోళంలో ఉంటారు. ఫలితంగా రోజంతా సమస్యలు ఉంటాయి. ఇష్టం లేని కొన్ని పనులు బలవంతంగా చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇంట్లో అసమ్మతి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం ఈ రోజు క్షీణిస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ఏదోక రూపంలో ధనలాభం అందుకుంటారు. సంతోషంగా వుండేందుకు ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ చివరకు సకాలంలో పూర్తి చేసుకుంటారు.

మీన రాశి: ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో అనారంగ్యంగా వున్నప్పటికీ పనులన్నింటిలోనూ విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో, కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. మీరు వారిని ధైర్యంగా విజేతగా బయటపడతారు. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story