Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Daily Horoscope Rashiphalalu
x

Daily Horoscope

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దిన‌ఫ‌లాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| వ‌సంత‌ ఋతువు వైశాఖ‌ మాసం| ఉత్తరాయణం సోమ‌వారం,| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.23| తిథి బ‌.పంచ‌మి ఉ.గం.07.08వరకు | తదుపరి ష‌ష్టి |నక్షత్రం శ్ర‌వ‌ణం రా.8.55 వరకు| తదుపరి ధ‌నిష్ట‌|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.1.08 నుంచి 2.45 వరకు| దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.10.48 నుంచి 12.20 వ‌ర‌కు

ఈ రోజు రాశిఫ‌లాలు

మేషం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. పనులలో విజయం. శుభవార్తలు వింటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: కొత్త పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: నూతన ఉద్యోగయత్నాలు సఫలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి.

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories