Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి మిత్రులే శత్రువుల్లా మారతారు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 2nd April
X

Daily Horoscope:(ఫైల్ ఇమేజ్)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి శుభా, అశుభ ఫలితాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శుక్రవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

ఈ రోజు రాశిఫలాలు

మేషం: ఈ రోజు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనాలుంటాయి. పనిప్రదేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. లేకుంటే మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో వాదనలు ఉండవచ్చు. ఈ వివాదాలు చట్టపరమైన మలుపుల వరకు వెళ్లవచ్చు. సాయంత్రం సమయంలో ప్రయోజనాలు అందుకుంటారు. అతిథి రాక మీ ఖర్చులను పెంచుతుంది.

వృషభం: వృషభ రాశి వారికి పనిప్రదేశంలో పైఅధికారితో విభేదాలు ఉండవచ్చు. సాయంత్రం నాటికి మీ పని నైపుణ్యంతో శత్రువులపై విజయం సాధించగలరు. గృహ వినియోగానికి అవసరమైన వస్తువును కొనుగోలు చేస్తారు. ఈ రోజు శుభ వ్యయం చేసే అవకాశముంది. వైవాహిక జీవితంలో ధనవంతులవుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

మిథునం: మిథున రాశి వారికి ఈ రోజ కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత స్నేహితుడితో సమావేశమవుతారు. ఈ రోజు నూతన పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందవచ్చు. మీరు బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ రోజు మీరు మీకిష్టమైనవారి నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి.

కర్కాటక రాశి: భాగస్వామ్య వ్యాపారంలో మద్దతు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో పురోగతి పొందవచ్చు. మనశ్శాంతి ఉంటుంది. అధిక శ్రమ అలసటకు దారితీస్తుంది. ఈ రోజు మీరు పనిలో విజయం సాధించకపోతే కలత చెందుతారు. కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోండి. అనంతరం నూతన శక్తితో కృషి చేసి విజయాన్ని అందుకుంటారు. ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది.

సింహ రాశి:సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నూతన పనిలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మీ శత్రువులు మీకు హాని కలిగిస్తారు. పనిప్రదేశంలో పదోన్నతులు పొందే అవకాశముంది. ఈ రోజు మీకు అత్తమామల వైపు నుంచి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.

కన్య: కన్యా రాశి వారికి ఈ రోజు ప్రతిష్ట పెరుగుతుంది. సామాజిక పనిలో మీరు సహకారం అందుకుంటారు. కార్యాలయంలో పెరిగిన జవాబుదారీతనం కారణంగా కొన్ని అసౌకర్య పరిస్థితులు తలెత్తుతాయి. ఈ సమయంలో మీరు భయపడాల్సిన పనిలేదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాత స్నేహితులను కలుస్తారు. అంతేకాకుండా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది.

తులా రాశి: ఈ రోజు మీకు ప్రాపంచీక ఆనందాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వారి సహాయం కూడా పొందుతారు. వ్యాపార ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విలువైనదాన్ని కోల్పోయే అవకాశముంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు దాన ధర్మాల్లో కాలాన్ని గడుపుతారు. ఏదైనా అనాథాశ్రమం లేదా వృద్ధాప్య గృహానికి విరాళం అందజేస్తారు. ఫలితంగా ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ హక్కులు పెరగడం వల్ల మీ సహోద్యోగుల మానసిక స్థితి కొంచెం చెదిరిపోవచ్చు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు హాజరు కావచ్చు.

ధనుస్సు: ఈ రోజు మీరు చుట్టుపక్కల వాతావరణంలో కొంచెం అసౌకర్యంగా ఉంటారు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. సాయంత్రం నాటికి పరిస్థితుల ప్రకారం నడుచుకుంటే మీకు ఆనందం కలుగుతుంది. మీకిష్టమై వ్యక్తి సహాయం తీసుకుంటారు. మీకు నచ్చిన వ్యక్తి సహాయం తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.

మకర రాశి: ఈ రోజు మీరు అకస్మాత్తుగా కుదుర్చుకునే ఒప్పందం వల్ల ఆర్థిక ప్రయోజనం అందుకుంటారు. ఇంట్లో భార్య లేదా పిల్లల ఆకస్మిక ఆరోగ్యం ఉద్రిక్తతకు కారణమవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఆందోళనం చెందకుండా జాగ్రత్తగా ఉండండి. స్నేహంలో ఏదైనా ప్రత్యేక పథకంలో భాగం కాకండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

కుంభరాశి: ఈ రోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనలాభం అందుకుంటారు. కుటుంబపరంగా జీవిత భాగస్వామికో కొన్ని కలతలు ఉండవచ్చు. మీరు తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితులను జాగ్రత్తగా అంచనావేసే అవకాశముంది. మీరు ప్రేమలో పడితే ఈ రోజు మీరు వివాహంలో మీ సంబంధాన్ని మార్చడం గురించి ఆలోచించవచ్చు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.

మీనరాశి: ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. తమ వృత్తిని ప్రారంభించిన వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు కూడా అప్పగించవచ్చు. పనిప్రదేశంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. సాయంత్రం సమయంలో మహిళా స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 2nd April
Next Story