Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 29 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 29 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 29 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి మ.2-57 తదుపరి చతుర్దశి | ఉత్తరాభాద్ర మ.2-49 తదుపరి రేవతి | వర్జ్యం రా.2-02 నుంచి 3-47 వరకు | అమృత ఘడియలు ఉ.7-35 నుంచి 9-19 వరకు | దుర్ముహూర్తం ఉ.9-49 నుంచి 10-35 వరకు తిరిగి మ.2-24 నుంచి 3-09 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తు,వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం,. శుభవా ర్తా శ్రవణం. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. దైవదర్శనాలు.

మిథునం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకు లు. దైవచింతన. వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. విందువినోదాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కన్య: రుణబాధలు తప్పవు. ఆలోచనలు కలసిరావు. అనుకున్న వ్యవహారాలలో స్వ ల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. కు టుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు.

తుల: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృశ్చికం: సన్నిహితులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు.

మకరం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనులలో ఆటంకాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

మీనం: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories