Daily Horoscope: ఈరోజు మీ రోజు! ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Horoscope 

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు.

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం|సోమవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

ఈ రోజు రాశిఫలాలు

మేషం: వ్యవహారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు.

సింహం: దూరపు బంధువుల కలయిక. దైవదర్శనాలు. యత్నకార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: పనులలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. బంధుమిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మకరం: వ్యవహారాలలో గందర గోళం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.


Show Full Article
Print Article
Next Story
More Stories