Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంభించి విజయం సాధిస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 29 Jun 2021 5:56 AM IST
Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంభించి విజయం సాధిస్తారు.
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపార వృద్ధి కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. పనిలో ఒత్తిడి అధికంగా వుంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీ తెలివి తేటలతో పనుల్లో విజయం సాధిస్తారు. సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. సమయానికి మితాహారం తీసుకోవాలి.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో పనిని ప్రారంభించి విజయం సాధిస్తారు. దీంతో మానసికానందాన్ని పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి వ్యాపారంలో త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఏదైనా అడ్డంకి లేదా నష్టాలు ఉండవచ్చు. కార్యాలయంలో ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు మీరు అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇల్లు, కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకోవడానికి అవకాశముంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే అవకాముంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు చదువు కోసం కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. ఇంట్లో మరమ్మతులు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. సాయంత్రం సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలో శారీరక, మానసిక బలహీనతలు అనుభవించవచ్చు. ఏదైన శుభకరమైన పని విషయంలో కుటుంబంతో చర్చించవచ్చు. పనిప్రదేశంలో విస్తరణ కోసం అదృష్టంపై ఆధారపడతారు. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

తులా రాశి: ఈరాశి వారికి ఏదైనా పెద్ద పని చేసే ముందు అనభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించాలని నిర్ధారించుకోండి. వ్యాపారానికి సంబంధించిన అన్ని వివాదాలను ఈ రోజు ప్రభుత్వ అధికారి సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులను కష్టపడి పూర్తి చేసుకుంటారు. దీని వల్ల రోజంతా లాభావకాశాలు ఉంటాయి. మీ కుటుబంలో శాంతి, స్థిరత్వాన్ని పొందుతారు. మీరు ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధువులు, పొరుగువారి సమస్యలను పరిష్కరించడంలో మీ సహాయం తీసుకుంటారు. సాయంత్రం సమయంలో స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

ధనస్సు రాశి: ఈ రాశివారు వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద లాభాలు పొందే అవకాశముంది. రోజువారీ పనులకు మించి కొత్తదనాన్ని ప్రయత్నించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఉంటాయి. కొందరు తమ కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారంలో చాలా లాభాల ఉంటాయి. రోజువారీ ఇంటి పనులను పరిష్కరించడానికి సువర్ణావకాశం లభిస్తుంది. కార్యాలయంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. దీని వల్ల కొంత నష్టం ఉంటుంది. స్వార్థం వల్ల ప్రజలు మీ తప్పును విస్మరించవచ్చు. ఆర్థిక లాభాలు ఉంటాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి తొందరపాటు పనులు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి అనారోగ్య సూచలనగు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపరంలో రిస్క్ తీసుకుని మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యలతో ఆనందంగా గుడుపుతారు. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా వుంటాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story