Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు!!

Today Horoscope
x

రాశిఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 29 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | కృష్ణపక్షం | పాడ్యమి - 23:43:32 వరకు తదుపరి విదియ | ఆశ్లేష నక్షత్రం - 27:21:23 (శనివారం తె.03:21:23) వరకు తదుపరి మఘ | వర్జ్యం 09:05:04 నుండి 09:50:27 వరకు | అమృత ఘడియలు 12:06:37 నుండి 12:52:00 వరకు | దుర్ముహూర్తం 09:05:04 నుండి 09:50:27, 12:52:00 నుండి 13:37:23 వరకు | రాహుకాలం 111:04:12 నుండి 12:29:18 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం:

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం:

సత్తా చాటుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం:

పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరింతగా చికాకులు.

కర్కాటకం:

బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం:

ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్య:

అనుకోని ప్రయాణాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

తుల:

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృశ్చికం:

కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు:

నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం:

వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వేడుకలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం:

పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మీనం:

వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories