Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 28 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 28 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. దైవదర్శనాలు. వస్తు, వస్త్రలాభాలు.

వృషభం: అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు మందగిస్తాయి.

మిథునం: ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబంలో ఒత్తిడులు. బ«ంధువుల కలయిక. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగమార్పులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆస్తి లాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి ఉపశమనం.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: కుటుంబంలో స్వల్ప చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. బంధువుల నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ధన వ్యయం.

మీనం: నిరుద్యోగులకు కీలక సమాచారం. విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. శుభవార్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories