Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు!!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

K V D Varma
Published on: 28 Jan 2021 5:23 AM IST
Horoscope today
X

రాశిఫలాలు 

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 28 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | పూర్ణిమ - 24:47:17 (శుక్రవారం తె.00:47:17) వరకు తదుపరి పాడ్యమి | పుష్యమి నక్షత్రం - 27:49:14(గురువారం తె.03:49:14) వరకు తదుపరి పుష్యమి | వర్జ్యం 07:34:26 నుండి 08:19:46 వరకు | అమృత ఘడియలు 12:06:27 నుండి 12:51:48 వరకు | దుర్ముహూర్తం 10:35:47 నుండి 11:21:07, 15:07:48 నుండి 15:53:09 వరకు | రాహుకాలం 13:54:08 నుండి 15:19:08 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం

పనుల్లో అనుకోని జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం

కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోబివృద్ధి.

మిథునం

సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలయ దర్శనాలు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిని విధంగా ఉంటాయి.

కర్కాటకం

కష్టపడ్డా ఫలితం కనిపించదు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

సింహం

ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.

కన్య

ఆకస్మిక ధన, వస్తులాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు ముందుకు సాగవు.

వృశ్చికం

ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధువుల ద్వారా ధనలాభం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

ధనుస్సు

మిత్రులతో అకారణంగా వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మకరం

వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనప్రాప్తి. స్థిరాస్తివృద్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం

వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

K V D Varma

K V D Varma

Next Story