Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 27 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 27 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 27 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి: రా. 9-26 వరకు తదుపరి ద్వాదశి | శ్రవణ నక్షత్రం రా.11-25 వరకు తదుపరి ధనిష్ఠ | వర్జ్యం: తె.వ. 3-34 నుంచి 5-13 వరకు | అమృత ఘడియలు: మ.12-50 నుంచి 2-28 వరకు | దుర్ముహూర్తం: సా.4-16 నుంచి 5-04 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-52

ఈరోజు రాశి ఫలాలు

మేషం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో గందరగోళం

మిథునం: పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీపై కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి.

వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు

మకరం: కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు.

మీనం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.

Show Full Article
Print Article
Next Story
More Stories