Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 27 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 27 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘం లో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. మిత్రులతో వివాదాల పరిష్కారం.

వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. దైవదర్శనాలు.

సింహం: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర పరిస్థితి.

కన్య: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

తుల: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థులకు మరింతగా ఒత్తిడులు.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మకరం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మీనం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దైవచింతన.

Show Full Article
Print Article
Next Story
More Stories