Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 27 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 27 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 27 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | ద్వాదశి - 07:48:25 వరకు తరువాత త్రయోదశి | అశ్వని నక్షత్రం - 24:22:47 తదుపరి భరణి | వర్జ్యం 08:42:20 నుండి 09:27:07 | అమృత ఘడియలు 11:41:28 నుండి 12:26:15 | దుర్ముహూర్తం 08:42:20 నుండి 09:27:07, 12:26:15 నుండి 13:11:02 | రాహుకాలం 10:39:53 నుండి 12:03:51 | సూర్యోదయం: ఉ.06-27 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశిఫలాలు

మేషం: కళాకారులకు నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు.

వృషభం: పనులు విజయవంతంగా కొనసాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు.

సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక‡ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు వాయిదా. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.

కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. విందువినోదాలు.

తుల: ఆర్థిక లావాదేవీలు సామాన్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు.

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల వాతావరణం. వాహనయోగం.

కుంభం: ఉద్యోగయోగం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.








Show Full Article
Print Article
Next Story
More Stories