Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు అన్ని రంగాల్లో పురోగతి దిశగా దూసుకెళ్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 27 Jun 2021 6:05 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 27th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులయందు విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్నిగడుపుతారు. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు. వివాదాలకు దూరంగా వుండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీ తెలివి తేటలతో పనుల్లో విజయం సాధిస్తారు. సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. సమయానికి మితాహారం తీసుకోవాలి.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఆశాజనకంగా వుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారికి అన్ని రంగాల్లో పురోగతి దిశగా దూసుకెళ్తారు. వ్యాపార కార్యక్రమాల్లో ముందుకు వెళ్తారు. మీకు గతంలో జారిన మంచి అవకాశాలను తిరిగి పొందడం కొనసాగుతుంది. ఈవెంట్లు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అందుకుంటారు. ఫలితంగా ఇది మీ మనస్సుకు ఆనందాన్ని చేకూరుస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత సంబంధాల సహకారంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు వివిధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ భాగస్వామితో కలిసి వనరులను ఏకీకృతం చేయగలరు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సహోద్యోగుల సహకారంతో ఈ రోజు మీరు పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయడంలో విజయవంతమవుతారు. అంతేకాకుండా సీనియర్ వ్యక్తుల జోక్యంతో చాలాకాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం పరిష్కరించుకుంటారు. మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులను చక్కగా అంచనా వేయండి.

తులా రాశి: ఈరాశి వారికి వ్యక్తిగత సంబంధాల విషయంలో జీవితంలో సమస్యలు ఉంటాయి. వ్యాపార సంబంధాల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యలతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నప్పటికీ మీరు ధైర్యంతో ఏ పని చేసినా అందులో విజయం సాధించగలరు. పనిలో, కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో నూతన వ్యక్తిని భాగస్వామిని చేసుకునేముందుకు అతని గురించి అన్ని వివరాలు సేకరించండి. అప్పుడే మీరు భవిష్యత్తులో చింతించాల్సిన అవసరముండదు.

ధనస్సు రాశి: ఈ రాశివారు ఆరోగ్యం, ఆర్థిక వనరులపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా సమయాన్ని వృథా చేయకపోవడం మంచిది. ఈ రోజు మీరు ఒకరికొకరు సహాయం కోరుతూ ఉంటారు. ఫలితంగా చాలా మంది మిమ్మల్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తారు. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే సమాజంలో మీ గౌరవం ప్రాముఖ్యత పెరుగుతుందని గుర్తుంచుకోండి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు జీవితంలో ముఖ్యమైన మార్పు వచ్చే అవకాశముంది. ఈ కారణంగా మీరు గడ్డుకాలం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంధకారం ముసురిన తెల్లవారుజామున వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి ఓపికంగా ఉండాలి. ఈ సమయంలో త్వరగానే గడిచిపోతుంది. కాబట్టి ఆందోళన పడకండి. వీలైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకండి. జీవితం చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి. గతాన్ని మర్చి వర్తమానంలో ఉంటే మంచిది. ఈ రోజు మీ కార్యాలయంలో ఊహించని మార్పులు జరిగే అవకాశముంది. ఇది మీకు కూడా మంచిది. కుటుంబంలో కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశముంది.

మీన రాశి: ఈ రాశి వారికి అనారోగ్య సూచలనగు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత సంబంధాల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఈ రోజు మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కావాల్సిన మద్దతు లభించదు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story