Daily Horoscope: ఈరోజు మీరోజు!ఈ రాశి వారికి వ్యాపారాలలో ఒడిదుడుకులు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Horoscope

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం ఉత్తరాయణం| చైత్ర మాసం వసంత బుతువు| సూర్యోదయం: 5.43 | సూర్యాస్తమయం సా.6.13| తిథి పౌర్ణమి ఉ.గం.09.52వరకు | తదుపరి పాడ్యమి |నక్షత్రం స్వాతి రా.9.49 వరకు| తదుపరి విశాఖ|రాహుకాలం ప. 3.00 నుంచి 4.30 వరకు| యమగండం ఉ.09.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం శ్లేషం ఉ. 5.40 నుంచి 6.09 వరకు| దుర్ముహూర్తం ఉ.08.15 నుంచి 9.04 పున: రా.3.02 నుంచి మ.4.32 వరకు| అమృతఘడియలు ప.1.36నుంచి 3.50 వరకు| కరణం బవ ఉ.09.52| యోగం సిద్ధి రా.9.52 గం.ల తదుపరి వ్యతిపాత |

ఈ రోజు రాశిఫలాలు

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. అంచనాలు నిజమవుతాయి. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం: సోదరులు, సోదరులతో సఖ్యత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మకరం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం:రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.

మీనం: కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories