Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 26 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 26 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవచింతన.

మిథునం: పనులు నెమ్మదిస్తాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిళ్లు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

సింహం: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ధనవ్యయం.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. పనులలో విజయం. బంధువర్గం నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు.

మకరం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

కుంభం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. పనులు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories