Daily Horoscope: వివిధ రాశుల వారి ఫలితాలు

Daily Horoscope: ఈరోజు మీరోజు! విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

Kranthi
Updated on: 26 March 2021 1:52 PM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today-26th-March-2021
X

Daily హోరోస్కోప్ :(ఫైల్ ఇమేజ్)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శుక్రవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.10 | సూర్యాస్తమయం సా.6.07| తిథి శు.పంచమి రా.గం.11.24వరకు | తదుపరి షష్టి |నక్షత్రం భరణి ఉ.8.28 వరకు| తదుపరి కృతిక|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం 6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.9.48 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.57 పున: మ.2.56 నుంచి మ.3.44 వరకు| అమృతఘడియలు -| కరణం బవ ఉ.10.19| యోగం వైధృతి ఉ.గం.8.12ల వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్‌ మీద బదిలీ చేసే అవకాశం ఉంది. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.

వృషభరాశి: ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో వాదనకు దిగే అవకాశం ఉంది.

మిథునరాశి: ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం వెనక్కు వెడుతుంది. స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.

కర్కాటకరాశి: అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధువులొకరు మీ సలహా తీసుకుంటారు. కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో చెట్టపట్టాలేసుకొని తిరుగుతారు.

సింహరాశి:ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలు బిజీగా ఉండి మిమ్మల్ని కలవలేపోవచ్చు.

కన్యారాశి: ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగకండి. త్వరలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రులు అండదండలు అందిస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. స్నేహితురాలు మీతో సరదాగా కాలక్షేపం చేస్తుంది.

తులారాశి: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానంలో ఒకరికి వివాహ సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులను అనుకూలంగా ఉంది. గృహ ప్రయత్నం సఫలం కావచ్చు. స్నేహితురాలితో సరదాగా గడుస్తుంది.

వృశ్చికరాశి: ఉద్యోగంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితురాలితో అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి.

ధనుస్సురాశి: ఉద్యోగంలో ప్రమోషన్‌ గానీ, ఇంక్రిమెంట్‌ గానీ లభించే అవకాశం ఉంది. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధవులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

మకరరాశి: ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. శుభకార్యాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరికీ హామీగా ఉండొద్దు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద విజయాలు సాధిస్తారు. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభరాశి: ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం అందుకుంటారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రలకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.

మీనరాశి: ఉద్యోగ సాఫీగానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడుతాయి. శుభకార్యాకాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.

గుల్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581



Kranthi

Kranthi

Next Story