Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 26 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 26 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 26 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | ద్వాదశి- 28:20:04 (డిసెంబర్ 27 తె.04:20:04) వరకు తదుపరి త్రయోదశి | భరణి నక్షత్రం - 10:35:31 వరకు తదుపరి కృతిక | వర్జ్యం 07:28:26 నుండి 08:12:49 వరకు | అమృత ఘడియలు 11:54:46 నుండి 12:39:09 వరకు | దుర్ముహూర్తం 06:44:03 నుండి 07:28:26, 07:28:26 నుండి 08:12:49 వరకు | రాహుకాలం 09:30:30 నుండి 10:53:44 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారులకు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

వృషభం:కుటుంబసభ్యుల సలహాలు పొందుతారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. వాహనయోగం.

మిథునం: కొత్త వ్యవహారాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాల ప్రస్తావన. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనయోగం. దైవదర్శనాలు.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, పనిభారం.

సింహం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు. స్వల్ప అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. విద్యావకాశాలు. శుభవర్తమానాలు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు.

తుల: కార్యక్రమాలు ముందుకు సాగవు. ధనవ్యయం. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధఇ. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వాహనసౌఖ్యం.

ధనుస్సు: కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. దూరప్రయాణాలు.

మకరం: పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు.

కుంభం: పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పరపతి పెరుగుతుంది.

మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. కొన్ని పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొంత నిరాశ.

Show Full Article
Print Article
Next Story
More Stories