Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి అన్నింటా విజయాలే

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 26 Jun 2021 6:02 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 26nd June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు అన్నీ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు జాగ్రత్తలు తీసుకోండి. చాలా కాలంగా పెండింగ్ లో వున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఏదైనా నూతన పని ప్రారంభించబోతున్నట్లయితే అకస్మాత్తుగా ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు ఒకరి సహాయంతో పూర్తి చేయవచ్చు.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు మీ పనిలో నూతనత్వం కోసం ప్రయత్నించండి. అప్పుడే సులభంగా అనుకున్న కార్యాన్ని పూర్తి చేయగలుగుతారు. పనిప్రదేశంలో అపారమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే కచ్చితంగా నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోండి. దీని నుంచి మీరు ప్రయోజనం పొందుతారు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి అధిక శ్రమ వల్ల ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత విరామం తీసుకోండి. నిరుత్సాహపడకండి. ఓపిక పట్టాలి. మీరు మీకు ఇచ్చిన బాధ్యతను తేలికగా నిర్వర్తిస్తారు. ఈ రోజు మీ కార్యకలాపాలను నిశితంగా గమనించాలి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. లేకుంటే నష్టాలు జరిగే అవకాశముంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు చేసే పనిలో తప్పులు లేకుండా చూసుకోండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే తీవ్ర విమర్శలు ఎదుర్కొని నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గుడపుతారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో మీకు ముఖ్యమైన పనులను ఇస్తారు. వీటిని పూర్తి చేయగలరా లేదా అనే అర్ధరహిత విషయాల గురించి ఆలోచించే బదులు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సాహిత్యంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప వేదికను పొందవచచు.

తులా రాశి: ఈరాశి వారికి ఈ రోజు వ్యాపారంలో అననుకూల ఫలితాలు కనపుడుతున్నాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో పిల్లల ఆనందం కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో ఎంత కష్టపడినా నామమాత్రపు ఫలితాలు ఘోచరిస్తున్నాయి. ఈ రోజు ఎవ్వరితోనైనా లావాలేవీలు నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి.

ధనస్సు రాశి: ఈ రాశివారు స్టాక్ మార్కెట్లో డబ్బు కోల్పోయే అవకాశముంది. తెలివిగా పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈ రోజు నూతన పని చేయకపోవడం మంచిది. ఇది కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అధిక ఖర్చులు ఘోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తండ్రి ఆర్థిక సాయంతో ఈ రోజు మీరు వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశముంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఒంటరిగా ఉంటూ మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. వివాదాలకు దూరంగా వుంటూ, సమయానికి ఆహారం తీసుకోవాలి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజులు పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు వుంటాయి. శత్రువుల పై విజయం సాధిస్తారు. ఏదైనా ప్రాపర్టీస్ కొనే ముందు పెద్దల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story